Sunday, April 24, 2011

14 th Sundy to 16 th Sunday

                                      2011: 16 ఆదివారము           తేది : 17-04-2011
ఆరాధనను గూర్చిన పాఠము - 3
యోహాను 4:24 "దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధింపవలెననెను.
" ప్రకటన 5:13 " అంతట పరలోకమందును, భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము" .....స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుటవింటిని "

ఆరాధన కార్యక్రమమును దేవుడే నియమించినాడు. మానవునికి దాని మీద అధికారము లేదు. దేవుడు చెప్పిన దానినే అనుసరించవలెను. అతిక్రమించితే శిక్షింపబడుదురు. మానవుడు తాను నియమించుకున్న నియమాలతో లేదా నిర్ణయాలతో దేవుని ఆరాధించకూడదు, కల్పితములు కాని, తీసివేయడము కాని ఆరధనలొ చేయకూడదు - లేవికాండము 10:1-3

ఆరాధనలోని రకములు:
1. వ్యర్థమైన ఆరాధన
మత్తయి 15:7-9  ".... వారు వ్యర్థముగా ఆరాధించుచున్నారు"
ఇది మానవుల యొక్క ఆచారముల ఆధారముగా జరుగుచున్నది. పారంపర్యాచారములు, పితరులాచారములు, లోకాచారములు, పెద్దలాచారములు, యూదులాచారములు మరియు మతాచారములతో కూడిజరుగుచున్నది - యెషయ 29:13 . నేడు లోకమందు ఎన్ని రకముల ఆచారములను యేసుని నమ్మినవారు అనుసరిస్తున్నారో ఆలోచించండి.!  పౌలు హెచ్చరించాడు - గలతి 1:13-14
2. స్వేచ్చారాధన
ఇది మనుష్యుల యొక్క స్వేచ్చా, స్వాతంత్రము మీద ఆధారపడినది. ఎవరికి ఇష్టము వచ్చినట్లు వారు చేయడము. కొలస్సి 2:20: " మనుష్యుల ఆజలను పద్ధతులను.....అనుసరించవద్దు … ",  ద్వితీ 4:2 : ".. దేవుని ఆజలతోదేనిని కలుపకూడదు, దేనిని తీసివేయకూదదు.. " ప్రకటన 22:18-19 , అపో"కా 17:23 .

హెచ్చరిక : హెబ్రి 10:24,25  " కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక. ఒకనినొకడు హెచ్చరించుచు, దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యొక్కువగా ఆలాగు చేయుచు....అలోచింతుము "

క్రీస్తు నందు మీ సోదరులు
S.M.వినయ్ కుమార్, సువార్తికులు,
క్రీస్తు సంఘము, నాయుడుపేట. సెల్ : 98858 45588, 277557
*** ఆదివారము ఆరాధనను నిర్లక్ష్యము చేయకుము ***

No comments:

New